Wednesday, October 19, 2011

పక్షులను చూసి మనషులు నెర్చుకున్నారా !.......


పక్షులను చూసి మనషులు నెర్చుకున్నారా !


మనుషులను చూసి పక్షులు నెర్చూకున్నాయా !
మనషులు జీవించడాని ఇల్లు చాల ముఖ్యం. కాని మనషులకే కాదు పక్షులకు కూడా ఎంతో అవసరము చూడండి. ఎంతో శ్రమతో, చక్కని అమరికతో, నైపుణ్యంతో, ఎంతో మంచిగా కట్టుకుంటున్నాయి. అది కూడా మనుషులకు అందనంత దూరంలో చెట్ల కొమ్మలకు చివరలో గూడు (ఇల్లు) కట్టుకుంటాయి. వర్షం వచ్చినా, గాలి వచ్చిన చెక్కుచెదరదు. మనషులు కూడా అంత మంచి అమరికను చేయగలడో లేదో అన్న విధంగా పక్షులు ఇల్లు కట్టుకుంటున్నాయి.
కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల ఫలితంగా నేడు మనుషులందరు ఇల్లు కట్టుకొని జీవించే పరిస్థితిలో లేరు. ఈ మధ్యకాలంలో ప్రణాళిక సంఘం, కేంద్ర ప్రభుత్వం తెలియపరిచిన లెక్కల వివరాలు చూస్తే (దారిద్య్ర రేఖకు దిగువ వున్నవారు) ఒక రోజు కూరగాయలకు రూ.1.95 పైసలు పోష్టికారం తినవచ్చు అంట. ఈలాంటి వారు బిపిఎల్‌ పరిధిలోకి రారు. కాని నేడు కోతిమిర కట్ట కూడా రూ.1.95 పైసలకు రాదు. ఆ విధంగా బ్రతకడమే కష్టంగా వున్నపుడు ఇల్లు కట్టుకోవడం పేదవారికి, చివరకు మద్యతరగతి రంగంలో కూడా కొంతమందికి 'కళ' గా వుంటుంతుది....