Saturday, July 28, 2012
Friday, July 27, 2012
Wednesday, July 25, 2012
Saturday, July 14, 2012
Friday, July 6, 2012
కుట్రపూరిత విధానాలపై సమరశీల ఐక్య ఉద్యమాలు
- సిఐటియు రాష్ట్ర మహాసభలో తపన్‌సేన్ పిలుపు
- కార్మిక వర్గంలో చైతన్యం పెంపొందించాలి
- యుపిఎ, ఎన్‌డిఎ విధానాల్లో తేడా లేదు
సామ్రాజ్యవాదులు, పెట్టుబడి దారులు, కేంద్ర మంత్రులు కలిసి
కార్మిక వర్గంపై కుట్ర పూరిత విధానాలను అవలంబిస్తున్నారని సిఐటియు అఖిల
భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా
కార్మిక వర్గం దేశవ్యాప్తంగా మరిన్ని సమరశీల ఐక్య పోరాటాలు నిర్వహిం చాలని
పిలుపునిచ్చారు. ఇదే సమయంలో రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతిక అంశాలపై
కార్మికుల్లో చైతన్యం, అవగాహన పెంపొందించాల్సిన అవసరముందని, తద్వారా కుల,
మత, ప్రాంతీయ భావా లతో కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనే కుట్రలను
తిప్పికొట్టాలని అన్నారు. హక్కుల సాధన, చట్టాల అమలు తదితర అంశాలపై కార్మిక
సంఘాలు గతంలో ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చాయని గుర్తుచేశారు. కేంద్ర
ప్రభుత్వ మెడలు వంచడానికి ఇది సరిపోదని, రానున్న రోజుల్లో దేశవ్యా ప్తంగా
అనేక రోజులు సమ్మెలు జరగను న్నాయని చెప్పారు. వీటిని జయప్రదం చేసేందుకు
సిద్ధంగా ఉండాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.
సిఐటియు
13వ రాష్ట్ర మహాసభ గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసి కళాభవన్ (కామ్రేడ్ వి
శ్రీహరి నగర్)లో ప్రారంభమైంది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వీరయ్య
అధ్యక్షతన జరిగిన సభలో తపన్‌సేన్ ప్రారంభో పన్యాసం చేస్తూ ప్రస్తుతం
దేశంలోని 99 శాతం కార్మికవర్గం ఒక శాతంగా ఉన్న పెట్టుబడిదారుల కబంధ
హస్తాల్లో నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
( ప్రజాశక్తి సౌజన్యంతో..... )
Subscribe to:
Posts (Atom)