ప్రభుత్వాలలో అవినీతికి వ్యతిరేకంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే తన జీవిత చరమాంకంలో పూరించిన శంఖారావం మరో స్వాతంత్ర్య పోరాటం కావాలి.
( గూగుల్ ఇమేజ్ ల సహకారంతో ...)
దేశంలో అవినీతిని నిరోధించడానికి జన లోక్‌పాల్ బిల్లు తీసుకురావాలని ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే చేస్తున్న డిమాండ్‌ను నెరవేర్చాలని, ఎన్నికల్లో నల్లధనం ప్రవాహాన్ని అరికట్టడం కోసం సంస్కరణలు తీసుకురావాలని కోరుదాం.

ఇప్పటికే విదేశాలలో మురిగిపోతున్న లక్షల కోట్ల నల్లధనం, దానికి తోడు బోఫోర్స్ నుండి నిన్నటి స్పెక్ట్రం కుంభకోణం వరకు ఎన్ని లక్షల కోట్లు రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల చేతులు మారిందో బహిరంగ రహస్యమే. అయినా ఏ ప్రభుత్వమూ అవినీతిని అంతమొందించే దిశగా అడుగులు వేయలేదు. ప్రజాస్వామ్య దేశంలో అవినీతి నిరోధానికి సరైన చట్టం లేకపోవటం ఒక విషాదమైతే, ఆ వెసులుబాటును ఆధారంగా చేసుకొని తమ అవినీతిని నిరూపించమని సవాళ్ళు విసిరే వ్యక్తులతో మంత్రివర్గాలు నిండి ఉండటం మరో విషాదం. అధికారంలో ఉన్న వ్యక్తుల అవినీతి ఏ నాటికి నిరూపించబడదనేది కటిక వాస్తవం.....
వారి పోరాటానికి మనం మన వంతు కర్తవ్యం చేద్దాం.
( గూగుల్ ఇమేజ్ లు , బ్లాగ్ ల సహకారంతో ...)
( గూగుల్ ఇమేజ్ లు , బ్లాగ్ ల సహకారంతో ...)
No comments:
Post a Comment