Wednesday, September 19, 2012

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..!




                           అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..!

Monday, August 20, 2012

అత్యంత పవిత్రమైనది...





 'రంజాన్' మాసం ముస్లిం సోదరీసోదరులకు అత్యంత పవిత్రమైనది, 
 'రంజాన్'  మహాపున్య మాసమని, మహోన్నత మైనదని ముస్లిం సోదరుల సంపూర్ణ విశ్వాసం.
  అందుకే ఈ రంజాన్ మాసానికి ఇంతటి గౌరవం, పవిత్రత ప్రప్తమయ్యాయి.  
   
 'రంజాన్' పండుగ శుభ సందర్భంగా మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!

Wednesday, August 15, 2012

అందరి పండుగ...


జాతి, కులం,మతం, ప్రాంతం అనే తేడాలనేవి లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాలతో  జరుపుకునే పండుగ స్వాతంత్ర్య  దినోత్సవం...

ఎందరో వీరుల త్యాగఫలం.
ఆగస్టు 15 మన దేశ చరిత్రలో మరచిపోలేని  ఒక అపురూపమైన రోజు.
తెల్లదొరల నిరంకుశ పాలనకు తెరపడిన రోజు.
మన దేశానికి విముక్తి లభించిన రోజు.
స్వాతంత్ర్యం  సాదించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం...
వారిని మన హృదయంలో నిలుపుకొని వందనం అర్పిస్తాం.

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.


Friday, July 6, 2012

CITU 13th state conferance, Hyd.





కుట్రపూరిత విధానాలపై సమరశీల ఐక్య ఉద్యమాలు

  • సిఐటియు రాష్ట్ర మహాసభలో తపన్‌సేన్‌ పిలుపు
  • కార్మిక వర్గంలో చైతన్యం పెంపొందించాలి
  • యుపిఎ, ఎన్‌డిఎ విధానాల్లో తేడా లేదు
                      సామ్రాజ్యవాదులు, పెట్టుబడి దారులు, కేంద్ర మంత్రులు కలిసి కార్మిక వర్గంపై కుట్ర పూరిత విధానాలను అవలంబిస్తున్నారని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా మరిన్ని సమరశీల ఐక్య పోరాటాలు నిర్వహిం చాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతిక అంశాలపై కార్మికుల్లో చైతన్యం, అవగాహన పెంపొందించాల్సిన అవసరముందని, తద్వారా కుల, మత, ప్రాంతీయ భావా లతో కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనే కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. హక్కుల సాధన, చట్టాల అమలు తదితర అంశాలపై కార్మిక సంఘాలు గతంలో ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చాయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచడానికి ఇది సరిపోదని, రానున్న రోజుల్లో దేశవ్యా ప్తంగా అనేక రోజులు సమ్మెలు జరగను న్నాయని చెప్పారు. వీటిని జయప్రదం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేశారు.
                     సిఐటియు 13వ రాష్ట్ర మహాసభ గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసి కళాభవన్‌ (కామ్రేడ్‌ వి శ్రీహరి నగర్‌)లో ప్రారంభమైంది. సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ వీరయ్య అధ్యక్షతన జరిగిన సభలో తపన్‌సేన్‌ ప్రారంభో పన్యాసం చేస్తూ ప్రస్తుతం దేశంలోని 99 శాతం కార్మికవర్గం ఒక శాతంగా ఉన్న పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
( ప్రజాశక్తి సౌజన్యంతో..... )

Saturday, January 14, 2012

GMPS Kalakarula sangam calendar 2012


sankranti greetings

               ఈ సంక్రాంతి అందరి ఇళ్ళల్లోనూ సంతోషాల పంట పండించాలని,
 విశ్వవ్యాప్తంగా విస్తరిల్లి, తెలుగుధనాని    విరాజిల్లుతున్న తెలుగు వారందరికి
సంక్రాంతి పర్వదిన శుభాభినందనలతో.....

Sunday, January 1, 2012

cpi(m) hyd, new year greetings 2012

              
        cpi(m) hyd, new year greetings 2012

బ్లాగరులందరికి, మిత్రుల అందరికీ...

                                   బ్లాగరులందరికి, మిత్రుల అందరికీ...
            మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయాభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...2012.
               

                  ఈ కొత్త సంవత్సరం సరికొత్త ఆలోచనలకు వేదిక కావాలి.
మనిషిగా జీవితంలో ఎదిగేందుకు., వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు., పదుగురికీ సాయపడే బుద్దిని అలవరచుకునేందుకు., చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమను పంచేందుకు ఈ నూతన సంవత్సరం  సకల జనావళికి దోహదపడాలని., ప్రతి ఒక్కరి కలలు ఫలించి ఈ ఏడాది శుభప్రదం కావాలని కోరుకుంటూ ...