Wednesday, April 13, 2011

35 ఏళ్ల సంప్రదాయం మారుతున్నదా.....


            కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో నేడు బుధవారం పోలింగ్‌ జరగనుంది. కేరళలో ఎల్‌డిఎఫ్‌, యుడిఎఫ్‌ పోటీ పడుతుండగా తమిళనాడులో డిఎంకె, అన్నాడిఎంకె కూటములు ఎన్నికల బరిలో ఉన్నాయి.
             35 ఏళ్ల సంప్రదాయం గా  కేరళ్ లొ సి.పి.ఎం.( వామపక్షాలు ) మరియు కాంగ్రెసులు వంతుల వరిగా అధికారన్ని కొనసగిసుతున్నాయి.
             పార్టీల జాతీయ అథిరధమహారధులు పాల్గొని మండె ఎండలొ వెడిని పుట్టించారు.  ప్రచారంలో  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సబలకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి విఎస్‌ అచ్యుతానందన్‌, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పినరయి విజయన్‌ , సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, ఎన్‌ రామచంద్రన్‌ పిళ్ళై, బృందాకరత్‌, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ హాజరయ్యారు. బిజెపి నేత ఎల్‌కె అద్వానీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాయావతి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రచారాo లో   పాల్గొన్నారు.
            కేరళ శాసనసభలో 140 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 2006లో ఎల్‌డిఎఫ్‌ 98 సీట్లలోనూ, యుడిఎఫ్‌ 42 స్థానాల్లోనూ విజయం సాధించింది.

Tuesday, April 12, 2011

ప్రపంచంలొ పొడవు ఐన బ్రిడ్జ్....

ప్రపంచంలొ పొడవు ఐన బ్రిడ్జ్....
చైనా లొ 32.5 కి.మి. గల డొంఘై బ్రిడ్జ్  వుంది.

Friday, April 8, 2011

మరో స్వాతంత్ర్య పోరాటం కావాలి....

           ప్రభుత్వాలలో అవినీతికి వ్యతిరేకంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నాహజారే తన జీవిత చరమాంకంలో పూరించిన శంఖారావం మరో స్వాతంత్ర్య పోరాటం కావాలి.


                                            ( గూగుల్ ఇమేజ్ ల సహకారంతో ...)
                         దేశంలో అవినీతిని నిరోధించడానికి జన లోక్‌పాల్‌ బిల్లు తీసుకురావాలని ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే చేస్తున్న డిమాండ్‌ను నెరవేర్చాలని,  ఎన్నికల్లో నల్లధనం ప్రవాహాన్ని అరికట్టడం కోసం సంస్కరణలు తీసుకురావాలని కోరుదాం.
           ఇప్పటికే విదేశాలలో మురిగిపోతున్న లక్షల కోట్ల నల్లధనం, దానికి తోడు బోఫోర్స్ నుండి నిన్నటి స్పెక్ట్రం కుంభకోణం వరకు ఎన్ని లక్షల కోట్లు రాజకీయ నాయకుల, ప్రభుత్వ అధికారుల చేతులు మారిందో బహిరంగ రహస్యమే.  అయినా  ఏ ప్రభుత్వమూ అవినీతిని అంతమొందించే దిశగా అడుగులు వేయలేదు. ప్రజాస్వామ్య దేశంలో అవినీతి నిరోధానికి సరైన చట్టం లేకపోవటం ఒక విషాదమైతే, ఆ వెసులుబాటును ఆధారంగా చేసుకొని తమ అవినీతిని నిరూపించమని సవాళ్ళు విసిరే వ్యక్తులతో మంత్రివర్గాలు నిండి ఉండటం మరో విషాదం. అధికారంలో ఉన్న వ్యక్తుల అవినీతి ఏ నాటికి నిరూపించబడదనేది కటిక వాస్తవం.....
                 వారి పోరాటానికి  మనం   మన వంతు కర్తవ్యం చేద్దాం. 
( గూగుల్ ఇమేజ్ లు , బ్లాగ్ ల  సహకారంతో ...)

Thursday, April 7, 2011

ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...కాపాడుదాం

                                                           ( గూగుల్ ఇమేజ్ ల సహకారంతో ...)
ఏప్రిల్ 7న జరిగే ప్రపంచ ఆరోగ్య దినం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంస్థాపనను గుర్తుకు తెస్తుంది, ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతాంశాన్ని ప్రపంచం ముందుకు తెచ్చేందుకోసం ఇదొక చక్కటి అవకాశం.  ప్రపంచ ఆరోగ్య దినం, వాతావరణ మార్పు దుష్ప్రభావాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడవలసిన అవసరంపై దృష్టి సారిస్తుంది.
“వాతావరణ మార్పు నుంచి ఆరోగ్యాన్ని కాపాడటం” అనే అంశం వాతావరణ మార్పు గురించిన ప్రపంచవ్యాప్త చర్చకు ఆహారాన్ని కేంద్రబిందువుగా ఉంచుతుంది. ప్రపంచ ప్రజారోగ్య భద్రతకు ప్రమాదాన్ని నిత్యం పెంచుతూ వస్తున్న వాతావరణ మార్పును అందరి దృష్టికి తీసుకురావడానికి WHO ఈ థీమ్‌ని ఎంపిక చేసుకుంది.
పరస్పర సహకారం పెరుగుతున్నందువలన, ప్రపంచ సముదాయం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంతో ముడిపడి ఉన్న ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి మరింతగా సన్నద్ధమవుతుంది.
              మన  బాధ్యతగా మాన  ఆరోగ్యాని కాపాడుకుందాం .ప్రపంచాని  కాపాడుదాం.
( వికి పీ డి య   సహకారంతో ...) 

Monday, April 4, 2011

జీవనం షడ్రుచుల అస్వాదనం.....

శ్రీ  ఖర నామ  సంవత్సరా  ఉగాది శుభాకాంక్షలు. బ్లాగ్  పాఠకులకు ,  శ్రేయోభిలాషులకు  మరియు  అందరికి ఉగాది శుభాకాంక్షలు ... 
              ఉగాది ఓ కొత్త  అనుబుతికి నాంది. నవీన ఆలోచనలకూ  పునాది. కొత్త  ఆలోచనలకూ,   కార్యచారనలకు ఉపిరి పోసుకునే వేళ. ఆకురాలే రోజులో ..కొత్త  చిగుళ్ళు.
              "ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైనది. ఉగాదినాడు షడ్రుచుల   సమ్మేళనం - తీపి, పులుపు, కారం , ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. జీవనం షడ్రుచుల అస్వాదనం. 
                తెలుగు ప్రజలకు అంత  శుభం జరుగాలని కోరుకొంటూ... 
                                                          ( గూగుల్ ఇమేజ్ ల సహకారంతో ...)

Sunday, April 3, 2011

28 ఏళ్ళ కల ....ఫోటో గ్యాలరి .....




28 ఏళ్ళ కల ....ఫోటో గ్యాలరి .....  సంక్రాంతి, దసరా, దీపావళి, రంజాన్, క్రిస్టమస్.... అన్ని పండుగలు  కలసి ఒక రోజు వస్తే ఎంత సంబరంగా  వుంటుంది.  అంతకు మించిన సంబరం దేశంలో ఇది ఒకటే.  02.04.2011 రాత్రి.

Friday, April 1, 2011

sfi hyd. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కొరకు ఉచిత శిక్షన తరగతులు

యస్.యఫ్.ఐ. హైదరాబాద్  నగర కమిటి  అద్వర్యంలో 10 వ తరగతి పూర్తీ చేసిన విద్యార్తులకు  పాలిటెక్నిక్  ఎంట్రన్స్ కొరకు ఉచిత శిక్షన  తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్తులు ఉపయోగిచుకోగలరు.